విక్రమ సింహపురి యూనివర్శిటీలో స్ట్రెస్ మేనేజ్మెంట్ అవగాహన కార్యక్రమం
విక్రమ సింహపురి యూనివర్శిటీలో స్ట్రెస్ మేనేజ్మెంట్ అవగాహన కార్యక్రమం
నెల్లూరు [వెంకటాచలం] రవికిరణాలు ఏప్రిల్ 11 :
కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, సర్ సీవీ రామన్ సెమినార్ హాల్‌లో శుక్రవారం “స్ట్రెస్ మేనేజ్మెంట్”పై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా రిజిస్ట్రార్ డా. కె.సునీత, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ శ్రీ నాగేశ్ బట్లపేనుమర్తి పాల్గొన్నారు.
శ్రీ నాగేశ్ మాట్లాడుతూ, వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని గుర్తించి, ధ్యానం, యోగా, సమయపాలన వంటి సాధనలతో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డా. సునీత మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా పెంపొందించుకోవాలన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సిహెచ్. విజయ, డా. మధుమతి, డా. ప్రభాకర్, డా. ఉదయశంకర్ సహా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.